22, ఏప్రిల్ 2012, ఆదివారం

గాలి అలల  మీద 
గాలి అలల మీద నీ నవ్వులు 
కాలం పూదోటలోన పువ్వులు 
ఎడమేరుగని మోహానా త్వరపడే తడబడే గుండె అడుగులు 
పలుకులేని, పలుకరాని మనసునుడుగులు 

నెలవంకలు నేలకు దిగి నా పక్కనె నడిచినట్లు 
నా వంకన నీ ఊపిరి సడి వినిపించే 
రాత్రిపెదవుల మీద రాగ మోహనవంశీ 
రాగాలలో నా మనసు లయించే 

బతుకుబాట, వెతుకులాట ఎదురు చూపులలోనా 
చిరకాలపు నేస్తమే ఎదురై పిలిచినట్లు 
మనసు లోగిలిలో మధురభావ స్వప్నాలై
నా లోపల ఎవరో తన ప్రాణము లూదినట్లు

ప్రత్యనువున నీ స్నేహమే పత్రహరితమైనట్లు 
వేలుగురేఖలలోన  నీ వెలుగే నిండెనే 
ఎంత ప్రేమ, ఎన్ని మమత, లెంతటి ఆత్మియతలో
బతుకు పరిమళాల గాలి నా లోపల వీచినట్లు  
 

 
వెండితీగలవాన ఉండుండి కురిసింది  
ఉండిపొమ్మని గాలి ఊరకే కొసరింది  
పండు వెన్నెల లాయెనో మనసులో 
పండుగల కొలువాయెనో

గుండె లోపలి మాట గుండెతో చెప్పింది 
గొంతు లోపలి మాట గుండె వినిపించింది 
ఎన్ని సందడు లాయెనో నేస్తమా 
ఎంత గారడి చేసెనో 

మబ్బులను కరిగించి మెరుపులే మెరిసాయి 
తబ్బిబ్బు చేసేటి వానలే కురిసాయి
చినుకు చినుకున పాటలే చిత్రంగా 
మనసు మునకలు వేసేరా  

సంధ్య కాంతుల్లోన తలపించు రూపమా 
ఆకాశాపుటంచు నెలవంక దీపమా
ఆణువణువూ  నీ స్నేహమే  ప్రియతమా 
ప్రాణమై రవలించెరా

ఎపుడైనా వొస్తావని ఎదురు చూస్తున్నాను
చూపులే దీపాలుగా వెలిగించినాను
ఎపుడోస్తావోమరి నువ్వు ,
ఎపుడిస్తవో చిన్ని నవ్వు  

పగలు, రేయి కలిసేటి పడమటి తీరాన 
మొగులు మీద వాలిపోయే  చిరువెన్నెల సోన
నీ కొరకే నా వాకిట నిల్చున్నాను 
పిలుపు లందలేదని మరిచేవ నన్ను 

గాలి కుదురు లేకుండా వెతుకుతోంది నిన్నే 
నీకు కబురు చెప్పాలని నేర్చుకుంది మాటలు 
నీ కొరకే ఈ భూమి తన చుట్టే తిరుగుతుంది 
నీదాకా చేర్చాలని చేస్తున్నది భ్రమణాలు

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

నిను పాటగా రాయగా  నినుపాటగా రాయగా
నీవే నా మనసై పాడగా
తరలిరాగ వసంతాలు
తరలి రాగవసంతాలు
హృదయ శ్రుతుల సంగీతాలు
ప్రాణాలే ఆలాపనలు